Hyderabad: వేధిస్తున్న యువకుడి కిడ్నాప్.. మిత్రులతో చితకబాదించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని!

  • సికింద్రాబాద్ లో ఘటన
  • తన స్నేహితులతో కలిసి స్కెచ్ వేసిన ఉద్యోగిని
  • ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి చితకబాదిన వైనం

రోజూ తనను వేధింపుల పాలు చేస్తున్న ఓ పోకిరీ యువకుడిని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (ఉద్యోగిని) కిడ్నాప్ చేసింది. హైదరాబాద్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు.. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న దివ్య, ఓ యువకుడు తనను వేధింపుల పాలు చేస్తున్న విషయాన్ని తన స్నేహితులకు చెప్పింది. దీంతో, ఆ యువకుడిని కిడ్నాప్ చేసేందుకు ఆ యువకులు పథకం వేశారు.

ఈ క్రమంలో ఆ యువకుడిని సికింద్రాబాద్ కు రమ్మనమని చెప్పడంతో అతను అక్కడికి వెళ్లాడు. దివ్య, ఆమె స్నేహితులు అతన్ని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి, ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి చితకబాదినట్టు తెలుస్తోంది. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందడంతో వారు రంగంలోకి దిగారు. ఈ కేసును గంటలోపే ఛేదించారు. దివ్యతో పాటు ఆమె స్నేహితులను అరెస్టు చేశారు.

More Telugu News