mammootty: 'యాత్ర'లో జగన్ పాత్ర ఉండదు: దర్శకుడు మహి.వి రాఘవ్

  • మమ్ముట్టి అద్భుతంగా చేశారు
  • ఆ డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది
  •  వచ్చేనెల 8వ తేదీన విడుదల  

తెలుగులో ఇప్పుడు బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. 'యాత్ర' సినిమాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గానే అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇది ఒక బయోపిక్ గా భావించవద్దనీ, యధార్థ సంఘటనలను ఒక కథగా ఆవిష్కరిస్తున్నానని మహి.వి రాఘవ్ చెప్పాడు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమా 30 శాతం రాజకీయాలకి సంబంధించిన నేపథ్యంలో కొనసాగుతుంది. మిగతా కథ అంతా కూడా హ్యూమన్ డ్రామాగా నడుస్తుంది. రాజశేఖర్ రెడ్డి పాత్రను హైలైట్ చేయడం కోసం ఎవరి పాత్రను తక్కువగా చూపించే ప్రయత్నం చేయలేదు. ఇక అంతా అనుకుంటున్నట్టుగా ఈ సినిమాలో జగన్ పాత్ర ఉండదు. నేను తయారు చేసుకున్న కథ వైఎస్ ను ఫోకస్ చేస్తూనే కొనసాగుతుంది. వైఎస్ పాత్రపట్ల పూర్తి అవగాహనతో మమ్ముట్టి ఈ సినిమా చేశారు. ఆయన వాయిస్ కూడా అద్భుతంగా ఉంటుంది. 'నేను విన్నాను .. నేను వున్నాను' అనే డైలాగ్ కే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది" అని అన్నారు. వచ్చేనెల 8వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. 

More Telugu News