Hyderabad: సొసైటీ నిర్లక్ష్యం వల్లే అగ్నిప్రమాదం.. మాకు న్యాయం చేయండి!: నుమాయిష్ బాధితుల ఆందోళన

  • 300కు పైగా షాపులు దగ్దం 
  • కర్రలు, ప్లాస్టిక్ నిర్మాణాలకు విస్తరించిన మంటలు
  • సొసైటీ భవనం ముందు బాధితుల ధర్నా

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం నుమాయిష్‌లో నిన్న రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంటల్లో సర్వస్వం కోల్పోయిన పలువురు బాధితులు ఈరోజు నాంపల్లి సొసైటీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. సొసైటీ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందనీ, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

 ఈ ప్రమాదంలో ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోని 2500 స్టాళ్లలో 300లకు పైగా దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. తొలుత ఒక స్టాల్లో చిన్నగా మొదలైన మంటలు ఇతర దుకాణాలకూ క్షణాల్లో పాకాయి. అధిక శాతం స్టాళ్లన్నీ ప్లాస్టిక్‌, కర్రలు, తదితర వస్తువులతో రూపొందించడం.. దుకాణాల్లో దుస్తులు, ప్లాస్టిక్‌ వస్తువులు వంటివి అధికంగా ఉండడంతో అవన్నీ క్షణాల్లో బుగ్గయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.40 కోట్ల మేర నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.

  • Loading...

More Telugu News