mammootty: 'యాత్ర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు

  • 'యాత్ర' బయోపిక్ పై భారీ అంచనాలు
  •  వచ్చేనెల 8వ తేదీన విడుదల
  •  రేపు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్    

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా 'యాత్ర' సినిమా నిర్మితమైంది. రాజశేఖర్ రెడ్డిగా మమ్ముట్టి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, మహి.వి రాఘవ్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ కి .. టీజర్ కి .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వచ్చేనెల 8వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ .. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలు కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఓ పోస్టర్ ను వదిలారు. వైఎస్ పాత్రలో ఈ సినిమాకి మమ్ముట్టి ప్రధాన బలంగా నిలవడంతో భారీగా అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి మరి.

More Telugu News