business: పెరిగిన ‘హెరిటేజ్ ఫుడ్స్’ లాభాలు.. ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందన్న నారా బ్రాహ్మణి!

  • 2018 చివరి త్రైమాసికంలో 618 కోట్ల ఆదాయం
  • అందులో 20 కోట్ల నికర లాభం నమోదు 
  • 9 నెలల కాలంలో రూ.62.43 కోట్ల నికర లాభం

2018, డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికానికి హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ మంచి లాభాలను నమోదుచేసింది. ఈ 3 నెలల కాలానికి రూ.618 కోట్ల ఆదాయం అర్జించినట్లు కంపెనీ తెలిపింది. మొత్తం మీద రూ.20.1 కోట్ల నికర లాభాన్ని ఆర్జించామని వెల్లడించింది. గతేడాది కంటే ఈసారి ఆదాయం పెరుగుదల 6.9 శాతం మాత్రమే ఉండగా, నికరలాభం మాత్రం 20 శాతం పెరిగింది. గత 9 నెలల కాలంలో కంపెనీ రూ1,879.73 కోట్ల ఆదాయంపై రూ.62.43 కోట్ల నికర లాభం ఆర్జించింది.

ఈ విషయమై హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి మాట్లాడుతూ..‘గత 9 నెలల కాలంలో మా నిర్వహణ లాభం చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం అన్ని ప్రాంతాలు, మార్కెట్లలో మా ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ కనిపిస్తోంది. ఆదాయం పెంచుకునేందుకు కీలక ఉత్పత్తుల రంగంలో మరింత వాటా దక్కించుకోవాలని భావిస్తున్నాం’ అని తెలిపారు.

More Telugu News