khammam: తెలంగాణలో జాతీయ రహదారి సర్వేను అడ్డుకున్న రైతులు.. అరెస్ట్

  • ఖమ్మం-దేవరపల్లి సర్వే పనులను అడ్డుకున్న రైతులు
  • అధికారుల ఫిర్యాదుతో రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • రహదారి కోసం తమ భూములను ఇవ్వబోమని చెప్పిన రైతులు
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారి సర్వే పనులను రైతులు అడ్డుకున్నారు. ఖమ్మం-దేవరపల్లి నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం తల్లాడ మండలం లక్ష్మీపురం, రామానుజవరం గ్రామాల్లో రెవెన్యూ అధికారులు సర్వేను చేపట్టారు. ఈ క్రమంలో వారిని స్థానిక రైతులు అడ్డుకున్నారు. దీంతో, పోలీసులకు అధికారులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రైతులను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న రైతు జిల్లా జేఏసీ నేతలు పోలీస్ స్టేషన్ కు వచ్చి రైతులను పరామర్శించారు. మరోవైపు, జాతీయ రహదారి కోసం తమ భూములను ఇవ్వబోమని రైతులు తెగేసి చెప్పారు.
khammam
farmers
national highway
survey
protest
arrest

More Telugu News