Chandrababu: 'ప్రత్యేక హోదా' కేసులు ఎత్తివేస్తాం.. త్వరలో జీవో ఇస్తాం!: చంద్రబాబు

  • ప్రత్యేకంగా జీవో విడుదల చేస్తాం
  • రాజీకొస్తే కేసులు మాఫీ చేస్తారు
  • ఎదురు తిరిగితే కేసులు పెడతారు

నేడు అమరావతిలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాన పార్టీలు వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్ష పార్టీలు గైర్హాజరయ్యాయి. విభజన హామీల సాధనే లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌, బీఎస్పీ, ఎస్పీ, ప్రజాశాంతి పార్టీ, నవతరం పార్టీ, ఆమ్‌ఆద్మీ పార్టీ, సచివాలయ ఉద్యోగులు, ఎన్జీవోలు, గెజిటెడ్‌ అధికారులు, రెవెన్యూ, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై కేసులు ఎత్తివేస్తామన్నారు. రేపటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని.. ఈ విషయమై ప్రత్యేకంగా జీవో విడుదల చేస్తామన్నారు. కోపం, ఆక్రోశం ఉందని.. అది దారి తప్పితే రాష్ట్రం మరో పంజాబ్‌గా మారేదన్నారు. అందుకే నవ నిర్మాణ దీక్షలతో ప్రజల ఆవేశాన్ని అర్థవంతమైన దారిలో పెట్టానన్నారు. రాజీకొస్తే కేసులు మాఫీ చేస్తారని.. ఎదురు తిరిగితే కేసులు పెడతారన్నారు. ఎన్నికల్లో కేసీఆర్ మీద కేసులు పెట్టి రాజీకొస్తే విత్ డ్రా చేసుకున్నారన్నారని చంద్రబాబు అన్నారు. రాహుల్, సోనియాగాంధీ, అఖిలేశ్ యాదవ్ మీదా కేసులు పెట్టారన్నారు.

More Telugu News