anasuya: విజయ్ దేవరకొండ సినిమాలో పాత్ర గురించి అనసూయ

  • నిర్మాతగా విజయ్ దేవరకొండ 
  • ప్రధానపాత్రల్లో తరుణ్ భాస్కర్ .. అనసూయ
  •  హీరో హీరోయిన్లు అంటూ ప్రచారం 

హీరోగా వరుస సినిమాలతో బిజీగా వున్న విజయ్ దేవరకొండ, నిర్మాతగాను రంగంలోకి దిగాడు. నిర్మాతగా తన తొలి సినిమాలో ప్రధాన పాత్ర కోసం ఆయన దర్శకుడు తరుణ్ భాస్కర్ ను ఎంపిక చేసుకున్నాడు. ఈ కథ నాలుగు ప్రధాన పాత్రల చుట్టూ తిరగనున్నట్టు వార్తలు వచ్చాయి. ఒక పాత్ర కోసం తరుణ్ భాస్కర్ ను .. మరోపాత్ర కోసం అనసూయను తీసుకున్నారు.

దాంతో తరుణ్ భాస్కర్ .. అనసూయ హీరోహీరోయిన్లు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై తాజాగా అనసూయ స్పందించింది. "ఈ సినిమాలో నేను చేసేది రొమాంటిక్ పాత్ర కాదు .. వేరే పాత్రలతో రొమాన్స్ కూడా ఉండదు. ఇది చాలా కీలకమైన పాత్ర అని మాత్రం చెప్పగలను. నా కెరియర్ కి ఈ పాత్ర చాలా హెల్ప్ అవుతుందనే నమ్మకం వుంది. మిగతా వివరాలు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాక చెబుతాను" అని అంది. అనసూయ ఇలా చెప్పిన తరువాత ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరగడం ఖాయమనిపిస్తోంది.

More Telugu News