nidhi agarwal: పూరి సినిమాలు ఆడటం లేదనే విషయాన్ని పట్టించుకోను: నిధి అగర్వాల్

  • 'ఇస్మార్ట్ శంకర్'లో చేస్తున్నాను 
  • నా కెరియర్ కి హెల్ప్ అవుతుంది
  • పక్కింటి అమ్మాయి పాత్రలు చేయాలనుంది
'సవ్యసాచి' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన నిధి అగర్వాల్, 'మిస్టర్ మజ్ను'తో మరోమారు ప్రేక్షకులను పలకరించింది. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందిస్తోన్న సినిమాలో ఆమెను కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ .. 'అవును .. నేను పూరి 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో చేయనున్నాను. ఈ మధ్య కాలంలో పూరి సినిమాలు ఆడటంలేదనే విషయాన్ని నేను పట్టించుకోను.

ఎందుకంటే ప్రతి ఒక్కరి కెరియర్లో ఒడిదుడుకులు అనేవి ఉంటూనే ఉంటాయి. పూరి ఆఫర్ ను కాదనడానికి నేను స్టార్ హీరోయిన్ ను కాదు గదా .. ఇప్పుడిప్పుడే ఒక్కో మెట్టూ ఎక్కుతున్న దాన్ని. పూరితో చేసే సినిమా నా కెరియర్ కి బాగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. ఎలాంటి పాత్రలు చేస్తారని అంతా అడుగుతున్నారు. గ్లామర్ తో పాటు నటనకి అవకాశం వున్న పాత్రలను చేస్తాను. పక్కింటి అమ్మాయిలా కనిపించే పాత్రలు చేయాలనుంది ..ఆ అవకాశం ఎప్పుడొస్తుందో మరి" అంటూ చెప్పుకొచ్చింది.
nidhi agarwal

More Telugu News