Jaya Jaitley: ఫెర్నాండెజ్ అంత్యక్రియల ద్వారా ఆయన రెండు కోరికలను తీరుస్తాం: జయా జైట్లీ

  • ఫెర్నాండెజ్ భౌతిక కాయాన్ని దహనం చేస్తాం
  • అస్థికలను పూడ్చి పెడతాం
  • కుమారుడు రాగానే అంత్యక్రియలు
రక్షణ శాఖ మాజీ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్(88) నేటి ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. చాలా కాలంగా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. స్వైన్‌ఫ్లూకు చికిత్స పొందుతూ దివంగతులయ్యారు. ఆయన కోరిక మేరకే అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు సామాజిక కార్యకర్త, సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు జయా జైట్లీ తెలిపారు.

నేడు  ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఫెర్నాండెజ్ భౌతికకాయాన్ని దహనం చేసి.. అస్థికలను పూడ్చి పెడతామని వెల్లడించారు. గతంలో తన భౌతిక కాయాన్ని దహనం చేయాలని చెప్పారని.. చివరి రోజుల్లో పూడ్చి పెట్టాలనే కోరికను వెల్లడించారని జయ తెలిపారు. దీంతో ఆయన రెండు కోరికలను తీర్చనున్నట్టు ఆమె వెల్లడించారు. పెర్నాండెజ్ కుమారుడు అమెరికాలో ఉంటున్నాడని.. ఆయన రాగానే.. రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు జయ తెలిపారు.  
Jaya Jaitley
Fernodez
Swine Flue
America

More Telugu News