Krishna Nagar: కృష్ణానగర్‌లో కలకలం రేపుతున్న పేలుడు.. ఒకరికి గాయాలు

  • మాణిక్‌రావు అనే వ్యక్తికి గాయాలు
  • ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
  • తనిఖీలు చేపట్టిన క్లూస్ టీం
హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో పేలుడు జరగడం కలకలం రేపుతోంది. నేటి సాయంత్రం స్వల్ప పేలుడు సంభవించడంతో దినసరి కూలీగా పనిచేసే మాణిక్‌రావు అనే వ్యక్తి చేతికి, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని గాంధీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చెత్తకుప్పలో దొరికిన డబ్బాను పగులగొడుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. అయితే డబ్బాలో ఉన్న రసాయన పదార్థమే దీనికి కారణంగా బావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే క్లూస్ టీమ్‌ను రప్పించి తనిఖీలు చేపట్టారు. పేలుడుకు గల కారణాలను క్లూస్ టీమ్ అన్వేషిస్తోంది.
Krishna Nagar
Manik Rao
Hyderabad
Blast
Clues Team

More Telugu News