ayodhya: కేంద్రానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తే.. దేశ వ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తాం: హాజి మెహబూబ్ అహ్మద్

  • రామ మందిరం కేసులో వివాదంలో లేని భూమిని యజమానులకు అప్పగించాలంటూ కేంద్రం పిటిషన్
  • ఆ భూమికి హిందువులు హక్కుదారులు కాదన్న మెహబూబ్ అహ్మద్
  • పిటిషన్ వెనుక భారీ కుట్ర దాగుందంటూ వ్యాఖ్య
అయోధ్య రామ మందిరం-బాబ్రీ మసీదు కేసులో వివాదంలో లేని 67 ఎకరాల భూమిని... దాని యజమానులైన రామ జన్మభూమి న్యాస్ కు లేదా రామ మందిరం ట్రస్ట్ కు అప్పగించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై సున్నీ వక్ఫ్ బోర్డు ప్రతినిధి హాజి మెహబూబ్ అహ్మద్ మండిపడ్డారు. ఆ భూమికి నిజమైన హక్కుదారులు హిందువులు కాదని ఆయన అన్నారు. దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పిటిషన్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరిస్తే... దేశ వ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరించారు. 
ayodhya
ram mandir
babri masjid
mehboob ahmed
Supreme Court
petetion

More Telugu News