Penugonda: రయ్... రయ్ కియా... తొలి కారును విడుదల చేసిన చంద్రబాబు!

  • పెనుకొండ సమీపంలో ఏర్పాటైన కియా కార్ల పరిశ్రమ
  • కొద్దిసేపటి క్రితం విడుదలైన తొలి కారు
  • మేడిన్ ఆంధ్రా కారుగా నిలుస్తుందన్న కియా చీఫ్
అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో ఏర్పాటైన కియా కార్ల పరిశ్రమ నుంచి తొలి కారు ఈ ఉదయం విడుదలైంది. ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తొలి కారును స్వయంగా విడుదల చేశారు. ఈ ఉదయం విజయవాడ నుంచి పుట్టపర్తికి ప్రత్యేక విమానంలో చేరుకున్న చంద్రబాబు, అక్కడి నుంచి హెలికాప్టర్ లో కియా పరిశ్రమలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వరకూ వెళ్లారు.

 సుమారు 650 ఎకరాల విస్తీర్ణంలో రూ. 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో కియా సంస్థ ఏర్పాటైన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే తాము రెండున్నరేళ్ల వ్యవధిలో ప్లాంటు, అసెంబ్లీ లైన్ ను నిర్మించి తొలి కారును తయారు చేయగలిగామని సంస్థ చీఫ్ పార్క్ వ్యాఖ్యానించారు. మేడిన్ ఆంధ్రా కారుగా ఈ కారు నిలుస్తుందని తెలిపారు.
Penugonda
KIA
First Car
Chandrababu

More Telugu News