KCR: 3, 5, 10 తేదీలలో ఒక ముహూర్తాన్ని ఖరారు చేయనున్న కేసీఆర్!

  • మంత్రివర్గ విస్తరణకు మూడు ముహూర్తాలు
  • ప్రస్తుతానికి మినీ క్యాబినెట్ గానే మంత్రివర్గం
  • లాబీయింగ్ ప్రారంభించిన ఆశావహులు

మరో రెండు వారాలు గడిస్తే, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అవుతుంది. ఇప్పటికీ తన మంత్రివర్గాన్ని ఇంకా ఖరారు చేసుకోని కేసీఆర్, సాధ్యమైనంత త్వరగా మంత్రులను ఎంపిక చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ఇందుకు ఫిబ్రవరిలో 3, 5, 10 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయని పండితులు సూచించడంతో, విస్తరణకు ఈ మూడు రోజుల్లో ఒకదాన్ని ఆయన ఎంపిక చేసుకుంటారని తెలుస్తోంది.

ప్రస్తుతానికి మినీ క్యాబినెట్ గానే విస్తరణ ఉంటుందని, ఆ తరువాత పూర్తి స్థాయి విస్తరణపై కేసీఆర్ దృష్టిని సారిస్తారని సమాచారం. ఇక ఈ విస్తరణలో గతంలో మంత్రులుగా పనిచేసిన వారిలో కొద్దిమందికి స్థానం లభిస్తుందని తెలుస్తోంది. దీంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ఆశావహులు, తమదైన శైలిలో కేసీఆర్ వద్ద లాబీయింగ్ చేయిస్తున్నారు.

ఇక వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుండగా, అది వచ్చేలోపే క్యాబినెట్ ను కొలువుదీర్చాలని కేసీఆర్ భావిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలన్న విషయమై ఇప్పటికే కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చేశారని, పార్లమెంట్ ఎన్నికల ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని తిరిగే వారికే ఈ దఫా చాన్స్ లభిస్తుందని సమాచారం.

More Telugu News