modi: చిప్పతో అడుక్కుంటున్నట్టు మోదీ ఫొటో మార్ఫింగ్.. ఎండీఎంకే నేత అరెస్ట్

  • మోదీ మధురై పర్యటనను వ్యతిరేకించిన డీఎండీకే
  • సోషల్ మీడియాలో మోదీ మార్ఫింగ్ ఫొటోను షేర్ చేసిన సత్యరాజ్
  • జ్యుడీషియల్ రిమాండ్ కు పంపిన కోర్టు
ప్రధాని మోదీ చేతిలో చిప్పతో అడుక్కుంటున్నట్టు ఫొటోను మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో పెట్టిన ఎండీఎంకే నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు శిర్కాళి పట్టణానికి చెందిన ఎండీఎంకే నేత సత్యరాజ్ అలియాస్ బాలు ఈ ఫోటోను మార్ఫింగ్ చేశారు. అతనిపై స్థానిక బీజేపీ నేత స్వామినాథన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, నిన్న సత్యరాజ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, నేడు కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన కోర్టు అతన్ని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించింది. జనవరి 26న మధురై పర్యటనకు మోదీ రావడాన్ని ఎండీఎంకే కార్యకర్తలు నిరసించారు. ఈ సందర్భంగా ఫేస్ బుక్ లో సత్యరాజ్ ఈ ఫొటోను అప్ లోడ్ చేశారు.
modi
photo
morphing
dmdk
leader
arrest

More Telugu News