kangana ranaut: ఆమెను ఒంటరిగా వదిలేయండి: క్రిష్ కు కంగనా సోదరి సూచన

  • 'మణికర్ణిక' చిత్రానికి సంబంధించి పూర్తి క్రెడిట్ కంగనా తీసుకుంటోందన్న క్రిష్
  • ప్రశాంతంగా ఉండాలంటూ క్రిష్ కు సూచించిన రంగోలి
  • విజయాన్ని ఆమెను ఎంజాయ్ చేయనివ్వాలంటూ విన్నపం

'మణికర్ణిక' చిత్రానికి సంబంధించిన పూర్తి క్రెడిట్ ను కంగనా రనౌత్ తీసుకుంటోందని దర్శకుడు క్రిష్ చేసిన వ్యాఖ్యలపై ఆమె సోదరి రంగోలి చందేల్ స్పందించింది. 'ఈ చిత్రానికి మీరే దర్శకత్వం వహించారని ఒప్పుకుంటున్నా. కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కంగానాదే. ఆమెను ఒంటరిగా వదిలేయండి. ఈ చిత్ర విజయాన్ని ఆమెను ఎంజాయ్ చేయనివ్వండి.' అంటూ ట్వీట్ చేశారు.

మణికర్ణిక చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని కారణాల నేపథ్యంలో ఆయన ఆ చిత్రం నుంచి తప్పుకున్నారు. అనంతరం దర్శకత్వ బాధ్యతలను కూడా కంగనానే చేపట్టింది. ఈ నేపథ్యంలో, పలు ఇంటర్వ్యూలలో క్రిష్ మాట్లాడుతూ, ఈ చిత్రం ద్వితీయ భాగంలో ఎక్కువ భాగాన్ని తానే తెరకెక్కించానని చెప్పారు. తొలి భాగంలో 20 నుంచి 25 శాతం వరకు కంగనా దర్శకత్వం వహించిందని... రెండో భాగంలో కేవలం 10 శాతం మాత్రమే చిత్రీకరించిందని తెలిపారు.

  • Loading...

More Telugu News