buddha venkanna: ఇలాంటి విచిత్రాన్ని దగ్గుబాటి కుటుంబంలోనే చూస్తున్నాం: బుద్ధా వెంకన్న

  • వైసీపీలో చేరబోతున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు
  • జగన్‌లో దగ్గుబాటి చూసిన నాయకత్వ లక్షణాలు ఏంటో చెప్పాలని డిమాండ్
  • వైసీపీ-బీజేపీ జాయింట్ వెంచరన్న బుద్ధా 

వైసీపీలో చేరబోతున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బావ ఒక పార్టీ, బావమరిది ఒక పార్టీలో ఉండడం ఇప్పటి వరకు చూశాం కానీ.. దగ్గుబాటి కుటుంబంలో మాత్రం భార్య ఒక పార్టీ, భర్త ఒక పార్టీలో ఉన్నారని, ఇలాంటి విచిత్రం ఒక్క దగ్గుబాటి కుటుంబంలోనే ఉందని ఎద్దేవా చేశారు.

పురందేశ్వరి బీజేపీలోనే ఉంటానని అంటున్నారని, ఆమె భర్త, కుమారుడు మాత్రం వైసీపీలోకి వెళ్తామని అంటున్నారని, బీజేపీ-వైసీపీ జాయింట్ వెంచర్ ఇదని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుందని అన్నారు. పురందేశ్వరి కుటుంబం జగన్ పంచన చేరుతుందని తాను మొదటి నుంచీ చెబుతూనే ఉన్నానని, అది ఇప్పుడు రుజువైందని బుద్ధా పేర్కొన్నారు. అయితే, పురందేశ్వరి వెళ్లకుండా భర్తను, కుమారుడిని పంపించారని విమర్శించారు. జగన్‌ను రెండేళ్ల నుంచి గమనిస్తున్నానని, ఆయన చాలా మంచోడని దగ్గుబాటి చెప్పడం హాస్యాస్పదమన్నారు. జగన్‌లో చూసిన ఆ నాయకత్వ లక్షణాలు ఏంటో చెప్పాలని బుద్ధా డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News