Congress: తమిళనాడులో బీజేపీకి రవ్వంతైనా చోటు లేదు: ఖుష్బూ

  • మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల ట్వీట్లు
  • తమిళనాడులో కమలం వికసించదు
  • గో బ్యాక్ అంటూ ట్రెండింగ్ 
తమిళనాడులో కాలు మోపాలన్న బీజేపీ ఆశలు ఫలించవని ప్రముఖ నటి, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి ఖుష్బూ తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రంలో కాలు మోపాలని ప్రయత్నిస్తేనే ప్రజలు ఎదురు తిరిగారని అన్నారు. ‘మోదీ గో బ్యాక్’ అంటూ ట్రెండింగ్ చేస్తున్నారని అన్నారు. తమిళనాడులో కమలం వికసించబోదన్నారు. రాష్ట్రంలో బీజేపీకి కానీ, ప్రధాని మోదీకి కానీ పిసరంత చోటు కూడా లేదని ఖుష్బూ పేర్కొన్నారు. మరోవైపు, కాంగ్రెస్ నేత జ్యోతిమణి, డీఎంకే నేతలు కూడా బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు.
Congress
Narendra Modi
Goback
BJP
Lotus
Khusboo

More Telugu News