Chandrababu: జయహో బీసీ గర్జనలో చంద్రబాబు వరాల జల్లు

  • పలు కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు
  • కార్ల కొనుగోలుపై 25 శాతం సబ్సిడీ
  • నాయీ బ్రాహ్మణులకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

బీసీలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. తూర్పుకాపులు, అగ్నికుల క్షత్రియులు, వర్నికుల క్షత్రియులు, శెట్టి బలిజ, యాదవులు, మత్స్యకారులు, ఈడిగ, యాత, శ్రీశయన, గౌడలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. చేనేతల కోసం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నాయీ బ్రాహ్మణులకు 150 యూనిట్లు, స్వర్ణకారులకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. రాజమండ్రిలో జరిగిన జయహో బీసీ సభలో చంద్రబాబు ఈ మేరకు వరాలను ప్రకటించారు.

అత్యంత వెనుకబడిన బీసీలకు ఇచ్చే సబ్సిడీని రూ. 30 వేల నుంచి రూ. 50 వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కార్ల కొనుగోలుపై బీసీలకు 25 శాతం సబ్సిడీ ఇస్తామని చెప్పారు. వడ్డెరలను ఎస్సీలలో చేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల సమయంలో రానున్న 75 రోజులు బీసీల ఇంటిపై టీడీపీ జెండా ఎగరాలని చెప్పారు. బీసీలకు సబ్ ప్లాన్ తీసుకొచ్చి చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో 150కి పైగా అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలను గెలుస్తామని చెప్పారు.

More Telugu News