Vijayashanthi: అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు : విజయశాంతి

  • నన్ను నిండు మనసుతో ఆదరించారు
  • నాపై ఆదరాభిమానాలు చూపించారు
  • ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు
రిపబ్లిక్ డే తాను రాజకీయరంగ ప్రవేశం చేసిన రోజు కావడంతో కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తనను ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా.. తన ఈ అలుపెరుగని పోరాటాల ప్రయాణంలో తనకు అండగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.

‘‘లేడీ సూపర్ స్టార్‌గా నన్ను నిండు మనసుతో ఆదరించిన ప్రజల కోసం పని చేయ్యాలనే కర్తవ్వంతో 1998 జనవరి 26వ తేదీన రాజకీయ జీవితం ప్రారంభించాను. అలుపెరగని పోరాటాల ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన నా తెలంగాణ బిడ్డలకు, అలాగే ఎల్లప్పుడూ నాపై ఆదరాభిమానాలు చూపిస్తున్న సీమాంధ్ర సోదరసోదరీమణులకు హృదయ పూర్వక ధన్యవాదాలు’’ అంటూ ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.
Vijayashanthi
Congress
Political life
Twitter

More Telugu News