NDA: వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. సస్పెండ్ చేసినా వెనుకాడం: రామ్మోహన్ నాయుడు

  • పార్లమెంటులో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తాం
  • ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను వ్యతిరేకిస్తాం
  • 2 నెలలు మాత్రమే ఉండే ఎన్డీయేకు బడ్జెట్ ప్రవేశపెట్టే అర్హత లేదు

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. దేశంలోని ఒక రాష్ట్రంగా ఏపీని చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర హక్కుల సాధన కోసం పార్లమెంటు సమావేశాల్లో తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని... సస్పెండ్ చేసినా వెనుకాడబోమని తెలిపారు.

 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను వ్యతిరేకిస్తామని చెప్పారు. రానున్న రెండు రోజుల్లో బీజేపీయేతర పక్షాలతో సమావేశమవుతామని చెప్పారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అర్హత ప్రస్తుత ప్రభుత్వానికి లేదని... మరో 2 నెలలు మాత్రమే ఉండే ఎన్డీయే ప్రభుత్వానికి సంవత్సరానికి అవసరమయ్యే బడ్జెట్ ను ప్రవేశపెట్టే అర్హత ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నించారు. ఈవీఎంల అంశంపై అన్ని పక్షాలతో కలసి ఈసీని కలుస్తామని చెప్పారు.

More Telugu News