Andhra Pradesh: పవన్ ఔటు.. ఇప్పుడు జగన్ ఔటు... బాబుకు వచ్చేస్తుంది: కెమెరాకు అడ్డంగా దొరికిన కేఏ పాల్

  • కెమెరా ఆఫ్ లో ఉందని ముచ్చట్లు
  • గతంలో టీడీపీ, వైసీపీలపై విమర్శలు
  • కలిసి రావాలని పవన్ కల్యణ్ కు పిలుపు
ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే నియోజకవర్గానికి రూ.100 కోట్లు ఇస్తామని ఆ పార్టీ అధినేత, మత ప్రచారకుడు కేఏ పాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ, వైసీపీలు తీవ్ర అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించిన పాల్.. తనతో కలిసి రావాల్సిందిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పిలుపునిచ్చారు. అంతేకాకుండా తాను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి రూ.లక్ష కోట్లు తెస్తానని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. అయితే తన మాటలకు విరుద్ధంగా ప్రవర్తించి పాల్ దొరికిపోయారు.

బయట మీడియా ముందు టీడీపీ, వైసీపీ, పవన్ లను ఏకిపారేస్తున్న పాల్.. కెమెరా ఆఫ్ లో ఉందనుకుని మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. ‘పవన్ ఔటు.. ఇప్పుడు జగన్ ఔటు.. బాబుకు వచ్చేస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ వీడియోను ఎప్పుడు తీశారన్న దానిపై స్పష్టత రాలేదు.
Andhra Pradesh
Pawan Kalyan
Chandrababu
Telugudesam
Jana Sena
ka paul
YSRCP
Jagan

More Telugu News