sarvepalli radhakrishnana: బీజేపీలో చేరనున్న మాజీ రాష్ట్రపతి మనవడు
- బీజేపీలో చేరనున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు సుబ్రహ్మణ్యం శర్మ
- యడ్యూరప్ప సమక్షంలో బీజేపీ తీర్థం
- సమాజంలో అసమానతలను తొలగించేందుకే రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటన
భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు సుబ్రహ్మణ్యం శర్మ నేడు బీజేపీలో చేరనున్నారు. కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్ణాటకలో ఉన్న అసమానతలను తొలగించేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపారు.
సమాజంలో ధనిక, పేద వర్గాల మధ్య అంతరాయం విపరీతంగా పెరిగిపోయిందని... దీన్ని తొలగించేందుకు ఎవరో ఒకరు పూనుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ అసమానతలను తొలగించేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి 'విమెన్ ఎంపవర్ మెంట్ పార్టీ' తరపున ఆయన పోటీ చేశారు.