dhanush: 'అసురన్' ఫస్టులుక్ తో అదరగొట్టేస్తోన్న ధనుశ్

  • ధనుశ్ హీరోగా 'అసురన్'
  • ఈ రోజునే షూటింగ్ మొదలు
  • ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్     

ధనుశ్ కథానాయకుడిగా తమిళంలో 'అసురన్' సినిమా నిర్మితమవుతోంది. వెట్రి మారన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి, తాజాగా ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ ఫస్టులుక్ పోస్టర్ లో ధనుశ్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు.

బ్లాక్ కలర్ బనీను .. గళ్ల లుంగీ పైకి కట్టి  .. బల్లెంతో దాడికి దిగుతున్నట్టుగా ఈ పోస్టర్ లో ఆయన కనిపిస్తున్నాడు. ఈ రోజు నుంచే ఈ సినిమా షూటింగ్ మొదలవుతోంది. ఈ సినిమాలో మంజు వారియర్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. తమిళ నవల 'వెట్కాయ్' ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకి, కలై పులి థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News