Congress: ఎమ్మెల్యే బానోతు హరిప్రియను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు.. టీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ దాడి

  • పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే
  • కోయగూడెంలో ప్రచారాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు
  • కార్యాలయంపై దాడిచేసి ధ్వంసం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలోని టీఆర్ఎస్ మండల కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్నిచర్‌ను, ఫ్లెక్సీలు తదితర వాటిని ధ్వంసం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే బానోతు హరిప్రియ కోయగూడెంలో ప్రచారం నిర్వహిస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. తమ ఎమ్మెల్యే ప్రచారాన్ని టీఆర్ఎస్ అడ్డుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. టీఆర్ఎస్ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకుని దాడికి పాల్పడ్డారు. కుర్చీలు, టేబుళ్లు, బెంచీలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. కార్యాలయంపై దాడిచేసిన వారిపై కేసులు నమోదు చేశారు.
Congress
TRS
Bhadradri Kothagudem District
koyagudem
Banotu Haripriya

More Telugu News