MLA: సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన మజ్లిస్ ఎమ్మెల్యే తనయుడు

  • మెదక్‌లోని బస్వాపూర్ నుంచి పోటీ చేసిన అఫ్సర్ మెయినొద్దీన్
  • టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో 60 ఓట్ల తేడాతో ఓటమి
  • రెండో విడతలోనూ కొనసాగిన టీఆర్ఎస్ హవా
తెలంగాణలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బరిలోకి దిగిన కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మెయినొద్దీన్ కుమారుడు అఫ్సర్ మొయినొద్దీన్ ఓటమి పాలయ్యారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని బస్వాపూర్‌లో సర్పంచ్‌గా పోటీ చేసిన ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి మల్లేశం గౌడ్ చేతిలో 60 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

 కాగా, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 4310  స్థానాల్లో 2600 స్థానాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు. రెండు విడతల్లో కలిపి  8300 పంచాయతీలకు ఎన్నికలు జరగగా 5300 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 1700 స్థానాల్లో విజయం సాధించారు.  
MLA
Afsar Moinuddin
Medka
Telangana
Panchayat polls

More Telugu News