India: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. పక్కా వ్యూహంతో బరిలోకి దిగిన కివీస్

  • జట్టులో ఎటువంటి మార్పులు చేయని భారత్
  • భారీ స్కోరు చేసి ఒత్తిడి పెంచుతామన్న కోహ్లీ
  • బౌలింగ్‌లో సత్తా చాటుతామన్న కివీస్ కెప్టెన్

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మౌంట్ మాంగనూయిలో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నేపియర్‌లో జరిగిన తొలి వన్డేలో కివీస్‌ను చిత్తుచేసిన భారత్.. రెండో వన్డేలోనూ అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు, ఈ వన్డేలో గెలిచి భారత్ ఆధిక్యాన్ని తగ్గించాలని కివీస్ యోచిస్తోంది.

టాస్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసి విలియమ్సన్ సేనపై ఒత్తిడి పెంచుతామన్నాడు. తొలి వన్డేలో దిగిన జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు.

కివీస్ కెప్టెన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. వికెట్‌పై పచ్చిక ఉందని, దానిని వినియోగించుకుంటామని తెలిపాడు. ఓపెనర్లు ధవన్, రోహిత్ శర్మ, కెప్టెన్ కోహ్లీలను తొలి పది ఓవర్లలోనే పెవిలియన్ పంపి భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు తమ బౌలర్లు సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. కాగా, ఏడు ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. ధవన్ 13, రోహిత్ శర్మ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

More Telugu News