Bharath: ‘భారత్’ టీజర్ విడుదల: ఆకట్టుకుంటున్న సల్మాన్ డైలాగ్

  • సల్మాన్, కత్రినా జంటగా ‘భారత్’
  • అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం
  • రంజాన్‌కు విడుదల
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్, కత్రికా కైఫ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘భారత్’. టీ సిరీస్ సమర్పణలో సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌ అండ్‌ రీల్‌ లైఫ్‌ ప్రొడక్షన్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా టీజర్‌ను గణతంత్ర దినోత్సవ కానుకగా నేడు చిత్రబృందం రిలీజ్ చేసింది.

‘అంతా నన్ను నీ ఇంటిపేరు ఏంటి? జాతి పేరేంటి? మతం పేరేంటి? అని అడుగుతుంటారు. వారందరికీ నేను చిరునవ్వుతో చెప్పే సమాధానం ఒక్కటే. మా నాన్న గారు దేశాన్ని మనసులో పెట్టుకుని నాకు ‘భారత్‌’ అని పేరు పెట్టారు. దానికి ముందు ఇంటి పేరు, జాతిని చేర్చి నన్ను, నా దేశాన్ని తక్కువ చేయలేను’ అంటూ సల్మాన్‌ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. టబు, సోనాలి కులకర్ణి, జాకీ ష్రాఫ్, దిశా పటానీ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది రంజాన్‌కు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  
Bharath
Salman Khan
Katrina Kaif
Republic Day
Tabu
Sonali Kulakarni

More Telugu News