‘సమర శంఖారావం’ మోగించిన జగన్.. బూత్ స్థాయి కార్యకర్తలతో భేటీ కానున్న వైసీపీ అధినేత!
- వచ్చే నెల 4 నుంచి టూర్ ప్రారంభం
- కార్యకర్తలు, కన్వీనర్లను కలుసుకోనున్న జగన్
- పార్టీ పటిష్టతపై వైసీపీ అధినేత దృష్టి
ఆయా జిల్లాల్లో పార్టీ పటిష్టత, ఎమ్మెల్యేలు, నేతల వ్యవహారశైలి, కార్యకర్తల అభిప్రాయం, ప్రజలు ఏమనుకుంటున్నారు? మొదలైన విషయాలను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. అనంతరం కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో కూడా బూత్ స్థాయి కమిటీల సమావేశాల్లో పాల్గొంటారు.
ఈ సమావేశాల తర్వాత బూత్ స్థాయి కన్వీనర్లతో జగన్ ప్రత్యేకంగా సమావేశమవుతారు. వచ్చే నెల 14న అమరావతి సమీపంలోని తాడేపల్లిలో జగన్ గృహప్రవేశ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో భేటీ అయ్యే అవకాశముంది.