Andhra Pradesh: ఏపీ హక్కుల కోసం భేటీకి 7 పార్టీలను ఆహ్వానించాం.. వైసీపీ రానని చెప్పింది!: ఉండవల్లి

  • ఈ నెల 29న విజయవాడలో భేటీ
  • ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీలపై చర్చ
  • ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటన
ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై చర్చించి పోరాడేందుకు ఈ నెల 29న విజయవాడలో సమావేశం అవుతామని పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఈ భేటీకి టీడీపీ, వైసీపీ, జనసేన సహా ఏడు రాజకీయ పార్టీలను ఆహ్వానించామని వెల్లడించారు. ఈ భేటీలో ఏపీకి జరిగిన అన్యాయం, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని పేర్కొన్నారు. రాజమండ్రిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

అయితే విజయవాడ భేటీకి హాజరయ్యేందుకు వైసీపీ అంగీకరించలేదని ఉండవల్లి తెలిపారు. ఏపీకి జరిగిన అన్యాయంపై మాట్లాడలేని దారుణమైన పరిస్థితిలో రాజకీయ పార్టీలు ఉన్నాయని విమర్శించారు. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ఉమ్మడి కార్యాచరణను రూపొందిస్తామని ఉండవల్లి ప్రకటించారు.
Andhra Pradesh
Special Category Status
7 parties
YSRCP
Telugudesam
Jana Sena
Vijayawada
29 january

More Telugu News