niharika: 'సూర్యకాంతం'గా నిహారిక .. సిద్ధమైపోయిన టీజర్

  • నిహారిక తాజా చిత్రంగా 'సూర్యకాంతం'
  • సాయంత్రం 5 గంటలకి టీజర్ రిలీజ్
  • మార్చిలో విడుదల చేసే అవకాశం

'ఒక మనసు'తో తెలుగు తెరకి కథానాయికగా పరిచయమైన నిహారిక, ఆ తరువాత కూడా నటనకి ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేస్తూ వెళుతోంది. ఆమె ప్రధాన పాత్రధారిగా 'సూర్యకాంతం' చిత్రం నిర్మితమవుతోంది. ప్రణీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నిహారిక జోడీగా రాహుల్ విజయ్ నటిస్తున్నాడు.

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా నుంచి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. సందీప్ ఎర్రమ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ను ఇస్తుందనే నమ్మకంతో నిహారిక వుంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి. 

More Telugu News