Guntur District: నరసరావుపేటలో ఉద్రిక్తం.. రాళ్లు విసురుకున్న టీడీపీ-వైసీపీ కార్యకర్తలు
- కోడెల శివరాం బర్త్‌డే సందర్భంగా పట్టణంలో ర్యాలీ
- వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి మీదుగా వెళ్తూ నినాదాలు
- ప్రతిగా వైసీపీ కార్యకర్తల నినాదాలు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో టీడీపీ-వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడికి దిగారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ మరింత ముదరడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. రాళ్ల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తలను ఆసుపత్రికి తరలించారు.
టీడీపీ నేత కోడెల శివరాం జన్మదిన వేడుకల సందర్భంగా నరసరావుపేటలో టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసం మీదుగా ర్యాలీ వెళ్తున్న సమయంలో స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు అనుకూలంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇది విన్న వైసీపీ కార్యకర్తలు శ్రీనివాసరెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది మరింత ముదరడంతో ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. రాళ్ల దాడిలో గాయపడిన ముగ్గురు వైసీపీ కార్యకర్తలను ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల దాడితో పట్టణంలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి.