Hyderabad: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు.. వడగళ్లు పడే అవకాశం

  • బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
  • అనుబంధంగా ఉపరితల ఆవర్తనం
  • ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

హిందూ మహాసముద్రం, దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు (శుక్ర, శనివారాల్లో) అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శనివారం ఉరుములతో కూడిన వడగళ్ల వాన పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రం-దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్ప పీడనానికి తోడు 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.

More Telugu News