Narendra Modi: సీబీఐ నూతన డైరెక్టర్ ఎంపికపై చర్చ.. నిర్ణయానికి రాలేకపోయిన కమిటీ!

  • మరోసారి నూతన డైరెక్టర్ ఎంపిక వాయిదా
  • 1982 - 85 బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పేర్ల పరిశీలన
  • పరిశీలనలో జేకే శర్మ, పరమిదర్ రాయ్, వీణామిత్ర పేర్లు 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి కమిటీ సభ్యులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున ఖర్గే సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీబీఐ నూతన డైరెక్టర్ ఎంపికపై చర్చ జరిగింది. కానీ కమిటీ ఓ నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో సీబీఐ నూతన డైరెక్టర్ ఎంపిక మరోసారి వాయిదా పడింది. ఈ సమావేశంలో 1982 - 85 బ్యాచ్ వరకూ ఉన్న ఐపీఎస్ అధికారుల పేర్లను సీబీఐ డైరెక్టర్ పదవి కోసం పరిశీలించినట్టు సమాచారం. కాగా, 1982వ బ్యాచ్‌కు చెందిన జేకే శర్మ, పరమిదర్ రాయ్, వీణామిత్ర తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
Narendra Modi
Mallikarjuna karge
Ranjan Gogoi
JK Sharma
Paramider Rai
veena mithra

More Telugu News