Chandrababu: డ్వాక్రా మహిళలకు 'పసుపు - కుంకుమ' కింద పదివేలు.. చంద్రబాబు ప్రకటన

  • ఎన్టీఆర్ వైద్య సేవ కింద రూ.5 లక్షలు
  • బీసీలు లేకుంటే టీడీపీ లేదు
  • గత ప్రభుత్వాలు బీసీలకు చేసిందేమీ లేదు
డ్వాక్రా మహిళలకు పసుపు - కుంకుమ కింద రూ.10 వేల చొప్పున ఇవ్వనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో బీసీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వైద్య సేవ కింద రూ.5 లక్షల వరకు సాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

మధ్యాహ్న భోజన పథకాన్ని తానే ప్రవేశపెట్టినట్టు ఆయన తెలిపారు. బీసీలు లేకుంటే టీడీపీ లేదని.. వారు వెన్నంటి ఉన్నంత వరకూ ఏ శక్తి తమను ఏం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు బీసీలకు చేసిందేమీ లేదని.. టీడీపీ బలపడుతుందనే బీసీలను అణచివేశారని చంద్రబాబు విమర్శించారు. పార్టీకి అండగా ఉండేవారి రుణం వచ్చే ఐదేళ్లలో తీర్చుకుంటానని ఆయన స్పష్టం చేశారు.
Chandrababu
Dwakra Women
Vundavalli
Mid day Meals
Telugudesam

More Telugu News