విజయన్ కంటే మహిళ నయం.. ఆయన అసమర్థుడిగా మారారు!: కేరళ సీఎంపై కాంగ్రెస్ నేత ఆగ్రహం
- విమర్శలు గుప్పించిన సుధాకరన్
- అంచనాలు తలకిందులు చేశారని వ్యాఖ్య
- ఒక్క పనినీ పూర్తి చేయలేకపోయారని మండిపాటు
ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రిగా విజయన్ సమర్థవంతంగా పనిచేస్తారని భావించాం. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన చెత్త పాలన సాగిస్తున్నారు. విజయన్ ఒక్క పనిని కూడా సక్రమంగా నిర్వర్తించలేకపోయారు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు విజయన్ మగాడిలా రంగంలోకి దూసుకొచ్చారు.
కానీ నేడు అసమర్థ సీఎంగా మిగిలిపోయారు. ఆయన కంటే మహిళలే నయం’ అని విమర్శించారు. కాంగ్రెస్ యూపీ తీర్పు విభాగం బాధ్యతలను ఓ మహిళ అయిన ప్రియాంకా గాంధీ చేపట్టిన నేపథ్యంలో సుధాకరన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గతేడాది కేరళను అతలాకుతలం చేసిన వరదల్లో 480 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.