ntr: ఎన్టీఆర్ జీవితంపై ఇంగ్లిష్ లో పుస్తకం.. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ప్రశంసలు!

  • ఇది కొనదగ్గ పుస్తకమని వ్యాఖ్య
  • ఈ నెల 27న హైదరాబాద్ లో కార్యక్రమం
  • ఆవిష్కరించనున్న అశోక్ గజపతి రాజు

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవితంపై రాసిన ‘ఎన్టీఆర్ ఏ బయోగ్రఫి’ పుస్తకం అద్భుతంగా ఉందని బీజేపీ నేత, పార్లమెంటు సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ప్రశంసించారు. ఇందులో ఎన్టీఆర్ గురించి తెలుసుకోదగ్గ విషయాలు చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ పుస్తకాన్ని చంద్రహాస్, లక్ష్మీనారాయణ రాశారన్నారు.తాను 63 పేజీల శాంపిల్ కాపీని చదివాననీ, ఇది కొనదగ్గ పుస్తకమని అన్నారు. ఈ మేరకు ఆయన ఈరోజు ట్విట్టర్ లో స్పందించారు. టీడీపీ నేత, కేంద్ర విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ఈ నెల 27న హైదరాబాద్ లోని హైటెక్స్ రోడ్డులో ఉన్న సైబర్ కన్వెన్షన్స్ లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.

More Telugu News