India: బ్యాలెట్ బాక్సులు వాడే ప్రసక్తే లేదు.. ఈవీఎంలను ఎవ్వరూ హ్యాక్ చేయలేరు!: కేంద్ర ఎన్నికల సంఘం

  • సార్వత్రిక ఎన్నికల్లో వీటినే వాడుతాం
  • బ్యాలెట్ విధానానికి వెళ్లడం కష్టం
  • కౌంటింగ్ ప్రక్రియ చాలా ఆలస్యమవుతుంది
భారత్ లో ఎన్నికల కోసం వాడుతున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ను హ్యాకింగ్ చేయడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలనే వాడుతామని తేల్చిచెప్పింది. కొన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నట్లు ఇప్పుడు బ్యాలెట్ విధానానికి వెళ్లడం కుదరదని వ్యాఖ్యానించింది.

దీనివల్ల కౌంటింగ్ ప్రక్రియ చాలా ఆలస్యమవుతుందని తెలిపింది. ఈవీఎంలపై ఎలాంటి అనుమానాలు ఉన్నా తమకు ఫిర్యాదు చేయొచ్చనీ, వాటిని నివృత్తి చేస్తామని పేర్కొంది. భారత్ లో వాడే ఈవీఎంలను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థలు తయారుచేస్తాయి.
India
ec
elelction
ballot boxes
evm
hacking
central election commisssion

More Telugu News