ntr: రాజమౌళి సినిమాలో ప్రముఖ దర్శకుడు!

  • షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
  • ముఖ్యమైన పాత్రలో సముద్రఖని
  • దర్శకుడిగా .. నటుడిగా మంచి ఇమేజ్

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా ఒక భారీ మల్టీస్టారర్ రూపొందుతోంది. 'ఆర్ ఆర్ ఆర్' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో ఇతర నటీనటులకు సంబంధించిన సమాచారం ఇంతవరకూ బయటికి రాలేదు. ఈ మధ్య ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం తమిళ నటుడు .. దర్శకుడు సముద్రఖనిని ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి.

ఈ వార్త నిజమేననేది తాజాగా అందుతోన్న సమాచారం. చాలా ప్రాధాన్యత కలిగిన ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఆయనను తీసుకున్నారట. ఆ పాత్ర ఏమిటనే విషయమే తెలియాల్సి వుంది. సముద్రఖనికి అభిరుచి కలిగిన దర్శకుడిగా .. సహజ నటుడిగా తమిళనాట మంచి పేరు వుంది. 'రఘువరన్ బీటెక్'లో ధనుశ్ తండ్రి పాత్ర ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాను, తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. 

More Telugu News