New Delhi: దేశ రాజధానిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

  • ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టిన మరో కారు
  • కారులో చెలరేగిన మంటలు
  • ఢిల్లీలోని ఆనంద్ విహార్‌లో ఘటన
ఢిల్లీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆనంద్ విహార్ ప్రాంతంలో వేగంగా వెళ్తున్న ఎకో స్పోర్ట్స్ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. దీంతో రెండు కార్లలోనూ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. మృతులను ముస్తాఫాబాద్‌కు చెందిన శంషాద్ (28), అక్షయ్ జైన్ (21), గార్వే సెహగల్ (30)గా గుర్తించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
New Delhi
Anand vihar
Car Accident
Police

More Telugu News