Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రేపు నీటి సరఫరా బంద్

  • మంజీరా మీటరింగ్ పాయింట్ల వద్ద విద్యుత్ పనులు
  • ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు నీటి సరఫరా బంద్
  • ప్రజలు గమనించాలని కోరిన హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీ
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం నీటి సరఫరా ఉండదని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీ) తెలిపింది. విద్యుత్ సరఫరా ఉండని కారణంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నీటి సరఫరా ఉండదని పేర్కొంది. మంజీరా మీటరింగ్ పాయింట్ల వద్ద విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసే పనుల్లో భాగంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, ఫలితంగా నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొంది.

బీహెచ్ఈఎల్ కంపెనీ, మ్యాక్స్ సొసైటీ-1, 2, అశోక్ నగర్, హెచ్ఐజీ, హెచ్‌సీయూ, ఎస్‌బీఐటీ, మదీనాగూడ, హెచ్ఐజీ, పి.సత్యనారాయణ ఎన్‌క్లేవ్, మియాపూర్, ఆర్సీ పురం, అశోక్‌నగర్, చందానగర్, అమీన్‌పూర్, హుడా కాలనీ, పీజేఆర్ కాలనీ, దీప్తిశ్రీనగర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని, ప్రజలు గమనించాలని హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీ కోరింది.
Hyderabad
manjeera water
HMWSSB
Miyapur
HCU
Ashok nagar

More Telugu News