soundarya rajanikanth: వచ్చే నెలలో రజనీకాంత్ కూతురు సౌందర్య పెళ్లి!

  • 2010లో అశ్విన్ తో వివాహం 
  • 2017లో విడాకులు 
  • క్రితం ఏడాది విషగన్ తో నిశ్చితార్థం      
రజనీకాంత్ కూతురు సౌందర్య వివాహం 2010వ సంవత్సరంలో అశ్విన్ అనే వ్యాపార వేత్తతో జరిగింది. ఒక కుమారుడు కలిగాక ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దాంతో 2017వ సంవత్సరంలో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత కొంత కాలానికి విషగన్ వనగమూడితో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో సౌందర్యకి నిశ్చితార్థం జరిగింది.

ఓ ఫార్మా కంపెనీ యజమాని అయిన విషగన్, కొన్ని తమిళ చిత్రాల్లోనూ నటించాడు. ఫిబ్రవరి 11వ తేదీన చెన్నైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వీరి వివాహం జరగనుంది. మెహెందీ .. సంగీత్ కార్యక్రమాలను కలుపుకుని, ఇది మూడు రోజుల పాటు జరిగే వివాహ వేడుక అని తెలుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకి హాజరు కానున్నట్టు సమాచారం.
soundarya rajanikanth

More Telugu News