priyanka gandhi: నీ జీవితంలో ప్రతి దశలో తోడుగా ఉంటా: భర్త రాబర్ట్ వాద్రా

  • ప్రియాంకకు తూర్పు ఉత్తరప్రదేశ్ ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు
  • అభినందించిన భర్త రాబర్ట్ వాద్రా
  • సాధ్యమైనంత గొప్పగా పని చేయమంటూ ప్రోత్సహించిన వైనం
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ గా ప్రియాంక గాంధీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన భార్య గురించి రాబర్ట్ వాద్రా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 'నీ జీవితంలో ప్రతి దశలో నీకు తోడై ఉంటా. నీ కార్య నిర్వహణలో సాధ్యమైనంత గొప్పగా పని చెయ్యి' అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

మరోవైపు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన ప్రియాంకపై కాంగ్రెస్ నేతలు అభినందనల జల్లు కురిపిస్తున్నారు. ప్రియాంక శక్తిమంతమైన నాయకురాలని, పార్టీ సిద్ధాంతాలను మరింత ముందుకు తీసుకువెళ్లగలరని రాహుల్ గాంధీ అన్నారు. రాజీవ్ శుక్లా మాట్లాడుతూ, ఫిబ్రవరి 1న విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత తనకు కేటాయించిన బాధ్యతలను ప్రియాంక చేపడతారని తెలిపారు.
priyanka gandhi
robert vadra
Rahul Gandhi
congress
Uttar Pradesh

More Telugu News