paruchuri: బ్రహ్మానందం తిరిగొచ్చే రోజు కోసం ఎదురుచూస్తున్నాను: పరుచూరి గోపాలకృష్ణ

  • బ్రహ్మానందం గొప్పనటుడు
  • ఆయనలో ఒక ఫిలాసఫర్ వున్నాడు
  • నాతో తన అభిప్రాయాలు పంచుకునేవాడు

ఈ వారం 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో బ్రహ్మానందాన్ని గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. బ్రహ్మానందంతో తనకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. "బ్రహ్మానందాన్ని నేను సరదాగా 'లేడీ సూర్యకాంతమ్మ' అని పిలుస్తూ వుంటాను. ఎందుకంటే ఒకే విధమైన పాత్రను అనేక పర్యాయాలు పోషించినప్పటికీ, ప్రేక్షకులకు విసుగు తెప్పించని విధంగా ఆయా పాత్రలను సూర్యకాంతమ్మ గారు చేయగలిగింది.

అలాగే ఒక నిజం తెలిసి .. ఆ నిజాన్ని దాచడానికి నానా తంటాలుపడే పాత్రను ఎన్నో సినిమాల్లో పోషించావు. అదే అమాయకత్వం ..అదే భయం .. అదే టెన్షన్ తో ప్రేక్షకులను మెప్పించావు .. అందుకేనయ్యా నిన్ను 'లేడీ సూర్యకాంతమ్మ' అంటాను అంటే నవ్వేవాడు. బ్రహ్మానందం గొప్ప ఫిలాసఫర్ .. ఆయనలో హ్యూమనిస్ట్ వున్నాడు .. కమ్యూనిస్ట్ వున్నాడు. నాతో తరచుగా తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉండేవాడు. అలాంటి బ్రహ్మానందం ఎప్పుడు తిరిగివస్తాడా అని ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News