Chandrababu: చిప్ టెక్నాలజీ తెలిసినవారు ఎవరైనా ఈవీఎంలు ట్యాంపర్ చేయవచ్చు: చంద్రబాబు

  • తన ఓటు సరిగ్గా పడిందనే నమ్మకం ఓటరుకు కలగాలి
  • పేపర్ బ్యాలెట్ ద్వారానే అది సాధ్యం
  • బ్యాలెట్ విధానంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఈవీఎంలకు వ్యతిరేకంగా స్పందించారు. ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చని పలువురు చెబుతున్నారని... చిప్ టెక్నాలజీ తెలిసిన ఎవరైనా ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చని ఆయన అన్నారు. ఈవీఎంలు ట్యాంపర్ అయ్యే అవకాశం ఉన్నందునే వీవీప్యాట్ లను తీసుకొచ్చారని చెప్పారు. ఓటు వేసిన వ్యక్తికి తన ఓటు సరిగ్గా పడిందనే నమ్మకం కలగాలని తెలిపారు. ఎన్నికల ఫలితాలపై నమ్మకం ఏర్పడాలంటే పేపర్ బ్యాలెట్ వల్లే అది సాధ్యమని చెప్పారు. బ్యాలెట్ విధానాన్ని మళ్లీ తీసుకురావాలనే అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని తెలిపారు. 
Chandrababu
evm
tamper
Telugudesam

More Telugu News