Andhra Pradesh: చిత్తూరు జిల్లా టీడీపీకి కంచుకోట.. జిల్లాకు ఇంకా చాలా చేస్తాం!: సీఎం చంద్రబాబు

  • జిల్లా ప్రజలు పార్టీ జెండాను మోశారు
  • కృష్ణా జలాలు తీసుకురావడం ఆరంభమే
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ అధినేత
చిత్తూరు జిల్లా టీడీపీకి కంచుకోట అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇన్నాళ్లూ పార్టీ జెండా మోసిన జిల్లా ప్రజలను ఆదుకోవడం తన బాధ్యతని వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే కృష్ణా జలాలను జిల్లాకు తీసుకొచ్చామని అన్నారు. ఇది ఆరంభం మాత్రమేననీ, చిత్తూరుకు ఇంకా చాలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ట్విట్టర్ లో స్పందించారు.

అనంతపురం జిల్లా సరిహద్దు బొంతలపల్లి నుంచి హంద్రినీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను చిత్తూరు జిల్లాకు రెండ్రోజుల క్రితం తీసుకొచ్చారు. దీనివల్ల చిత్తూరులోని 7 నియోజకవర్గాల్లో ఉన్న 38 మండలాలకు సాగునీరు అందుబాటులోకి రానుంది.
Andhra Pradesh
Chittoor District
krishna water
handrineeva
Telugudesam
stronghold
Chandrababu

More Telugu News