Andhra Pradesh: ‘ప్రజాశాంతి’లో చేరావంటే మంత్రిని చేస్తా.. కుదరకుంటే 100 కోట్లు ఇస్తా!: వంగవీటి రాధకు కేఏ పాల్ బంపర్ ఆఫర్

  • టీడీపీలో చేరితే కాపులు క్షమించరు
  • రూ.100 కోట్లను రంగా ట్రస్టుకు ఇచ్చేస్తా
  • మీడియాతో మాట్లాడిన కేఏ పాల్
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. దయచేసి టీడీపీకి అమ్ముడుపోవద్దని ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాధాకృష్ణను కోరారు. తాను స్థాపించిన ప్రజా శాంతి పార్టీలో చేరాలని వంగవీటి రాధాకృష్ణను ఆయన ఆహ్వానించారు.

ప్రజాశాంతి పార్టీలో చేరితే తాను ఎమ్మెల్యే టికెట్ ఇస్తాననీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక మంత్రిని కూడా చేస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ ఈ హామీని నెరవేర్చలేకపోతే రూ.100 కోట్లు చెల్లిస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ మొత్తాన్ని వంగవీటి రంగా పేరుపై నడుస్తున్న ట్రస్టుకు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. తండ్రిని చంపిన టీడీపీలో చేరితే వంగవీటి రాధాకృష్ణను కాపులు జీవితంలో క్షమించరని హెచ్చరించారు. 
Andhra Pradesh
vangaveeti ranga
radha
100 crore
ka paul
minstry
Telugudesam
YSRCP
prajasanthy

More Telugu News