Andhra Pradesh: ముహూర్తం ఖరారు.. నేడు వైసీపీలో చేరనున్న మేడా మల్లికార్జునరెడ్డి!

  • సాయంత్రం 4 గంటలకు లోటస్ పాండ్ కు చేరిక
  • ఈరోజు చంద్రబాబుతో భేటీకి రాని మల్లికార్జునరెడ్డి
  • చంద్రబాబుతో రాజంపేట, జమ్మలమడుగు నేతల భేటీ

టీడీపీ నేత, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమయింది. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీకి రావాల్సిందిగా ఆహ్వానం అందినప్పటికీ, మేడా గైర్హాజరు అయ్యారు. ఈ క్రమంలో మల్లికార్జున రెడ్డి, తన సోదరుడు రఘునాథ రెడ్డితో కలిసి ఈ రోజు వైసీపీలో చేరనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో మేడా వైసీపీలో చేరుతారని పేర్కొన్నాయి.

మరోవైపు మేడా మల్లికార్జునరెడ్డి టీడీపీకి ద్రోహం చేశారని సీఎం రమేశ్ మండిపడ్డారు. టీడీపీలో చేరిన వెంటనే మేడాకు చంద్రబాబు ప్రభుత్వ విప్ పదవిని కట్టబెట్టారనీ, ఆయన తండ్రిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యుడిగా నియమించారనీ, కోరిన కాంట్రాక్టులు, పనులు చేయించారని గుర్తుచేశారు.

మరోవైపు ఈ వ్యవహారంపై కడప జిల్లా జమ్మలమడుగు, రాజంపేట టీడీపీ నేతలు ఈరోజు చంద్రబాబుతో భేటీ అయ్యారు. కాగా, మేడాకు పోటీగా రెడ్ బస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన చరణ్ రాజు పేరును మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రతిపాదిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News