Haryana: ఆస్తి అంతా ప్రియురాలికి ఇచ్చేస్తాడని.. కాంట్రాక్టు హంతకులతో భర్తను హత్య చేయించిన భార్య!

  • హరియాణాలోని గురుగ్రామ్ లో ఘటన
  • రూ.16 లక్షలు సుపారీ ఇచ్చేందుకు అంగీకారం
  • నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు
అనుమానం పెనుభూతంగా మారి ఓ కుటుంబాన్ని నాశనం చేసింది. తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానించిన భార్య ఆస్తి మొత్తాన్ని ఆమె పేరునే రాసేస్తాడని భయపడింది. ఇది జరగకుండా ఉండాలంటే భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఏకంగా ఓ ముఠాకు సుపారీ ఇచ్చింది. చివరికి ఈ కేసును విచారించిన పోలీసులు సదరు భార్యను కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన హరియాణా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో చోటుచేసుకుంది.

గురుగ్రామ్ కు చెందిన జోగీందర్ స్వీటీ అనే మహిళను వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లియినప్పటి నుంచి తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని స్వీటీ అనుమానించేది. సంపాదన మొత్తాన్ని ఆమెకే తగలేస్తున్నాడని విమర్శించేది. ఈ క్రమంలో ఆస్తి మొత్తాన్ని సదరు మహిళకే ఇచ్చేస్తాడని భయపడ్డ ఆమె కాంట్రాక్ట్ కిల్లర్లకు రూ.16 లక్షలకు సుపారీ ఇచ్చింది. ఇందులో రూ.2.5 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చింది. దీంతో ఆ దుండగులు జోగీందర్ ను ఈ నెల 17న దారుణంగా హత్యచేసి గోనెసంచిలో కుక్కి పడేశారు.

జోగీందర్ కనిపించకపోవడంతో ఆయన సోదరుడు పోలీసులను ఆశ్రయించారు. అదే సమయంలో బజ్‌గేరా ప్రాంతంలో ఓ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చనిపోయిందని జోగీందరే అని అతని కుటుంబ సభ్యులు భోరున విలపించారు. ఈ నేపథ్యంలో తన అన్న చావుకు వదిన స్వీటీనే కారణమని మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారు. దీంతో తానే ఈ హత్య చేయించానని స్వీటీ అంగీకరించింది. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు స్వీటీని కటకటాల వెనక్కు నెట్టారు. పరారీలో ఉన్న ఆరుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Haryana
husband killed
by
wife
suspecion
extra martial affair
Police
arrest

More Telugu News