venkatesh: 100 కోట్లకి చేరువలో 'ఎఫ్ 2'

  • సంక్రాంతికి వచ్చిన 'ఎఫ్ 2'
  • తిరుగులేని కామెడీ కంటెంట్ 
  • ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల గ్రాస్

అనిల్ రావిపూడి పూర్తి హాస్యరస భరితంగా 'ఎఫ్ 2' సినిమాను తెరకెక్కించాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. వసూళ్ల విషయంలో పాత రికార్డులను చెరిపేస్తూ .. కొత్త రికార్డులను తిరగరాస్తూ దూసుకువెళుతోంది.

ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా నిన్నటితో కలుపుకుని 16 కోట్ల షేర్ ను రాబట్టింది. త్వరలోనే 20 కోట్ల షేర్ మార్క్ ను అందుకోవడం జరుగుతుందని చెబుతున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో 70కోట్ల గ్రాస్ ను ..  47 కోట్ల షేర్ ను ఈ సినిమా రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా నిన్నటితో 90కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. మరికొన్ని రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమనేది ట్రేడ్ పండితుల అంచనా. ఏదేమైనా, కామెడీ కంటెంట్ కి తిరుగులేదనే విషయాన్ని ఈ సినిమా మరోమారు నిరూపించింది. 

More Telugu News